Caught On Camera: Woman Falls Off Scooter In Middle Of Road, Wrongfully Blames Rider Behind Her
mictv telugu

డ్రైవింగ్ రాక కిందపడి.. వెనకొస్తున్న రైడర్‌పై గయ్యిమన్న గయ్యాళి

June 21, 2022

Caught On Camera: Woman Falls Off Scooter In Middle Of Road, Wrongfully Blames Rider Behind Her

కెమెరాలో రికార్డయింది కాబట్టి సరిపోయింది కానీ.. ఈ ఆడోళ్లు చేసిన పనికి ఓ అమాయకుడు తన్నులు తినేవాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. వీడియోలో ఇద్దరు మహిళలు ఒక స్కూటీపై వెళ్తుండగా హైవేపై ఒక్కసారిగా వారు కింద పడటం కూడా గమనించవచ్చు. డ్రైవ్ చేస్తున్న మహిళ ఫ్రంట్ బ్రేక్ సడన్‌గా వేయడం వల్ల స్కూటీ ఒక్కసారిగా జారి పడింది.

దీంతో వెనుక కూర్చున్న మహిళతో పాటు రైడర్ కూడా కింద పడింది.అయితే వెనుక కూర్చున్న మహిళ వెంటనే పైకి లేచింది.మరోవైపు ఈ యాక్సిడెంట్ ను చూడగానే వారి వెనకే వస్తున్న ఒక బుల్లెట్ బైకర్ బ్రేక్ వేసి అలాగే ఉండిపోయాడు. అయితే ఆ మహిళ అతన్ని చూసి “నీ వల్లే ఆక్సిడెంట్ అయ్యింది.స్కూటీకి ఎందుకు డాష్ ఇచ్చావు? నడపడం రానప్పుడు పెద్ద బైక్స్ వేసుకొని రోడ్లమీదకు ఎందుకు వస్తారో” అంటూ తెలివి ప్రదర్శించింది. అదృష్టవశాత్తూ ఈ బైకర్‌ ఒక బాడీక్యామ్ అప్పటికే ఆన్ చేసి ఉంచాడు. ఇదే విషయాన్ని అతడు చెబుతూ.“నేనేం చేయలేదు. కావాలంటే బాడీక్యామ్ లో ఏం జరిగిందో చూడండి” అన్నట్లు వీడియో చూపించాడు. ఈ వీడియోలో ఆ బైకర్ తప్పేం లేదని స్పష్టంగా తెలుస్తోంది. సదరు లేడీస్ వారంతట వారే కిందపడి వెనక వ్యక్తిని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారని కూడా క్లియర్ గా కనిపించింది. దీంతో మరో మాట మాట్లాడకుండా ఆ ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఏది ఏమైనా బాడీ కెమెరా వల్ల బైకర్ బతికి పోయాడు.