CBI arrested Anubrata Mondal in west bengal
mictv telugu

మమతకు సీబీఐ షాక్.. 20 వేల ఆవుల తలలతో పట్టుబడ్డ జిల్లా అధ్యక్షుడు అరెస్ట్

August 11, 2022

వెస్ట్ బెంగాల్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. ఇటీవలే విద్యాసంస్థల్లో నియామకాల కుంభకోణం కేసులో మంత్రి పార్థ ఛటర్జీ, అతని సన్నిహితురాలు అర్పిత ముఖర్జీని ఈడీ అరెస్ట్ చేసింది. తాజాగా గురువారం సీబీఐ మమతకు అత్యంత సన్నిహితుడు, బీర్భూమ్ జిల్లా పార్టీ అధ్యక్షుడు అనుబ్రత మోండల్‌ను అరెస్ట్ చేసింది. ఆవుల అక్రమ రవాణా కేసులో 2020లో నమోదైన కేసులో సీబీఐ ఈ చర్య తీసుకుంది. అంతకు ముందు రెండు సార్లు సీబీఐ అనుబ్రతను ప్రశ్నించగా, తర్వాత విచారణ కోసం పది సార్లు సమన్లు జారీ చేసింది. అయితే వాటిని అనుబ్రత పట్టించుకోకపోవడంతో సీబీఐ కోర్టును ఆశ్రయించింది. సీబీఐ వెల్లడించిన ప్రకారం కేసు వివరాలు ఇలా ఉన్నాయి. 2015 నుంచి 2017 వరకు విదేశాలకు తరలిస్తున్న 20 వేల ఆవుల తలలను సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ దళాలు పట్టుకున్నాయి. దీంతో 2020లో కేసు నమోదు చేసిన సీబీఐ ఇటీవల దాడులు నిర్వహించి అనుబ్రతతో పాటు ఆయన బాడీగార్డు సైగల్ హుస్సేన్‌ను అరెస్ట్ చేసింది.