అవినీతి, బెదిరింపుల కేసులో బుక్కయ్యారు నలుగురు సీబీఐ ఆఫీసర్లు. వారి ఘనకార్యం ఉన్నతాధికారులకు తెలియడంతో ఉద్యోగాల నుంచి పీకేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సీబీఐ ఢిల్లీ యూనిట్లలో పని చేస్తున్న నలుగురు CBI అధికారులు అవినీతికి పాల్పడ్డారు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడంటూ ఓ వ్యాపారి నుంచి రూ.25 లక్షల డబ్బును వీరు డిమాండ్ చేశారు. బాధితుడు సీబీఐ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది.
సీబీఐ సబ్ ఇన్ స్పెక్టర్లు సుమిత్ గుప్తా, ప్రదీప్ రాణా, అంకున్ కుమార్, ఆకాశ్ అల్హావత్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పైసా వసూళ్లకు పాల్పడినట్లు ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. చండీగఢ్‌కు చెందిన వ్యాపారికి ఇంటికి వెళ్లి సోదాల పేరుతో బెదిరించారని దర్యాప్తులో తేలడంతో ఉద్యోగాల నుంచి తొలగించినట్లు వెల్లడించాయి.