గుర్మీత్ బాబా రేపిస్టే - MicTv.in - Telugu News
mictv telugu

గుర్మీత్ బాబా రేపిస్టే

August 25, 2017

డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాంరహీం సింగ్ ను అత్యాచారం కేసులో కోర్టు దోషిగా నిర్ధారించింది. శుక్రవారం మధ్యాహ్నం పంచకులలోని సీబీ ఐ ప్రత్యేక కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ నెల 28న ఆయనకు కోర్టు శిక్షను ఖరారు చేస్తుంది. గుర్మీత్ 2002లో సిర్సాలో ఇద్దరు సాధ్విలపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

తీర్పుకు ముందే పంజాబ్, హరిణాలు గుర్మీత్ అనుచరుల ఆందోళనతో ఉద్రిక్తంగా మారాయి. అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా వేల మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం చేశారు. గుర్మీత్ కోర్టుకు వందలాది వాహనాల కాన్వాయ్ తో చేరుకోవడంతో కోర్టు వద్ద స్వల్ప ఉద్రికత్త తలెత్తింది. బాబా అనుచరులు తీర్పులపై మండిపడుతున్నారు.