ముఖ్యమంత్రి అవినీతిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశం - MicTv.in - Telugu News
mictv telugu

ముఖ్యమంత్రి అవినీతిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశం

October 12, 2018

చట్టం ఎవరి చుట్టమూ కాదు. నేరం చేసిన వారిని బోనెక్కించి శిక్షించాల్సిందే. అప్పుడు చట్టాలపై నమ్మకం పెరుగుతుంది. నేరస్తులు భయపడతారు. ఈ దిశగా తమిళనాడు హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిపై వచ్చిన అనివీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.

ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సీబీఐ విచారణ జరపాలని  జస్టిస్ జగదీశ్ ఈ రోజు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో పారదర్శక విచారణ కోసమే కేసును సీబీఐకి అప్పగించామని, మూడు నెలల్లోగా ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.హైవే ప్రాజెక్టుల కేటాయింపులో  పళనిస్వామి లంచాలు పుచ్చుకున్నారని, అయిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టారని విపక్ష డీఎంకే కోర్టుకెక్కింది.

Madras HC Orders CBI Probe Into Corruption Allegations Against Tamil Nadu CM Palanisamy in highways constructions projects

కోర్టు ఆదేశాలతో సీఎంతో  పాటు ఆరోగ్యమంత్రి సి. విజయభాస్కర్ సీబీఐ విచారణ ఎదుర్కొంటారు.కాగా, తమ ప్రాథమిక దర్యాప్తుల్లో సీఎం అవినీతికి పాల్పడినట్లు ఆధారాలేవీ దొరకలేదని కొన్ని దర్యాప్తు సంస్థలు చెప్పాయి. అయితే పారదర్శక విచారణ కోసం ఉన్నతస్థాయి దర్యాప్తు అవసరమని కోర్టు అభిప్రాయపడింది. కాగా, సీఎంతో సంబంధాలున్న కంపెనీలపై ఐటీ అధికారులు ఇటీవల దాడులు చేసి రూ.270 కోట్ల లెక్కాపత్రాలు లేని నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసుకు మసిపూసి మారేడు కాయ చేస్తున్నాని విపక్షాలు మండిపడుతన్నాయి.