సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ రాజీనామా.. త్వరలో రాజకీయాల్లోకి - MicTv.in - Telugu News
mictv telugu

సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ రాజీనామా.. త్వరలో రాజకీయాల్లోకి

March 22, 2018

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల కేసుల్లో పట్టువదలని విక్రమార్కుడిలా వెంటపడి చేసిన దర్యాప్తుతో దేశమంతా తెలిసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆయన రేపోమాపో రాజకీయాల్లోకి వచ్చే అవకాశముంది. మహారాష్ట్రలో అడిషనల్ డీజీగా పనిచేస్తున్న నారాయణ వలంటరీ రిటైర్మెంట్ తీసుకుని, రాజీనామా చేశారు. దాన్ని ఆమోదించాలని మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలను కోరారు. ఆయన రాజీనామాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది.

ఏపీ రాజకీయాల్లోకి..

కర్నూలుకు చెందిన లక్ష్మినారాయణ.. రాజకీయాల్లోకి రావడానికే సర్కారు కొలువుకు రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఏడాదిలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయన ఏపీ రాజకీయాల్లోవి వస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జగన్ కేసులో నిక్కచ్చిగా వ్యవహరించానన్న క్రెడిట్ తనకు రాజకీయాల్లో పనికొస్తుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన నాటి యూపీఏ సర్కారు ప్రోద్బలంతోనే జగన్ పై ఉత్తిత్తి కేసులు బనాయించారనే ఆరోపణలు ఉన్నారు. గత ఏడాది లక్ష్మీనారాయణ ఇంట్లో దొంగలు రెండున్నర కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లడంతో ఆయన విశ్వసనీయతను పలు పార్టీలు ప్రశ్నించాయి.  అంత సొమ్ము ఎలా సంపాదించారని నిలదీశాయి.