జేడీ లక్ష్మీనారాయణ సంచలన నిర్ణయం.. ఓటమి భయంతోనేనా! - MicTv.in - Telugu News
mictv telugu

జేడీ లక్ష్మీనారాయణ సంచలన నిర్ణయం.. ఓటమి భయంతోనేనా!

March 14, 2019

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన స్వయంగా స్వంత రాజకీయ పార్టీ పెడతారని మొదట్లో వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరుతారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీడీపీ తరపున లక్ష్మినారాయణ పోటీ చేస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయనతో టీడీపీ నేతలు కూడా భేటీ అయి, పార్టీలోకి ఆహ్వానించారు. అయినప్పటికీ ప్రస్తుతం జరుగనున్న ఎన్నికలకు దూరంగా ఉండాలని లక్ష్మినారాయణ నిర్ణయించుకున్నారు.

Cbi ex-joint director lakshmi narayana decided not to contest in upcoming election

ఈ నేపథ్యంలో లక్ష్మినారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేయనని ప్రకటించారు. తటస్తంగా ఉంటూ.. ప్రజాసేవ-ఎన్జీవో కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు. మరోవైపు, సార్వత్రిక ఎన్నికల తర్వాత రాజకీయ ప్రవేశంపై ఆలోచిద్దామని తన సన్నిహితులతో లక్ష్మినారాయణ చెప్పినట్టు సమాచారం. ఆయన ఓటమి భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయంగా విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే ఏ పార్టీలో చేరకుండా తటస్థ వైఖరిని ఎంచుకున్నారని పలువురు విమర్శిస్తున్నారు.