జనసేనలోకి మాజీ జేడీ లక్ష్మీనారాయణ - MicTv.in - Telugu News
mictv telugu

జనసేనలోకి మాజీ జేడీ లక్ష్మీనారాయణ

March 17, 2019

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ‌నారాయణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన సొంత పార్టీ పెడతారని మొదట్లో జోరుగా ప్రచారం జరిగింది. కొద్దిరోజులకు ఆయన ఇతర పార్టీలో చేరుతారని కూడా వార్తలొచ్చాయి. ఈనేపథ్యంలోనే ఆయన ఆదివారం జనసేన పార్టీలో చేరారు.

 

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసిన మాజీ జేడీ లక్ష్మీ‌నారాయణ జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ పార్టీ కండువా కప్పి లక్ష్మీనారాయణను ఆహ్వానించారు. అయితే లక్ష్మీనారాయణ విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తారని సమాచారం. మొదట్లో లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరతారని ప్రచారం జరిగినా.. ఆయన అనుహ్యంగా పవన్ పార్టీలో చేరి అందర్ని ఆశ్చర్యానికి గురి చేశారు.