CBI filed counter affidavit on YS Viveka murder case petition transfer to other state
mictv telugu

ఏపీ సర్కార్‌కు షాక్.. వివేక హత్య కేసు వేరే రాష్ట్రానికి..

October 19, 2022

ఏపీలోని వైసీపీ సర్కార్‌కు సుప్రీం కోర్టు గట్టి షాకిచ్చింది. ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. ఆ రాష్ట్రంలో నిర్వహిస్తున్న విచారణపై నమ్మకం లేదని.. దర్యాప్తు సంస్థ అధికారులు సాక్ష్యులను బెదిరిస్తున్నారని.. కాబట్టి ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వివేక కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. నేడు ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. తన తండ్రి హత్య కేసు విచారణను ఏపీలో కాకుండా తెలంగాణ లేదా కర్ణాటకకు మార్చాలని సునీత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా జరిపించాలన్న సునీత డిమాండ్‌కు సుప్రీం ఓకే చెప్పింది.

ఏ రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుకుంటున్నారని ప్రతివాదులైన ఉమాశంకర్ రెడ్డి, గంగిరెడ్డిలను సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. అయితే తెలంగాణ రాష్ట్రానికి మాత్రం బదిలీ చేయవద్దని, కర్ణాటకకు బదిలీ చేయాలని కోర్టును సీబీఐ అభ్యర్థించింది. అయితే తన తండ్రి హత్య కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరిన సునీతా రెడ్డి తరుఫు న్యాయవాదులు మాత్రం.. తెలంగాణకు బదిలీ చేసినా తమకు ఫర్వాలేదని తెలిపారు. గంటకు పైగా జరిగిన వాదనల్లో ఈ. ఏపీ పోలీసులు దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్నారంటూ వివేకా హత్య కేసులో సునీత చెబుతున్నంతా నిజమేనని సుప్రీంకోర్టులో సమర్పించిన అఫిడవిట్‌లో సీబీఐ స్పష్టం చేసింది. వివేకా హత్య కేసు నిందితులతో రాష్ట్ర పోలీసులు కుమ్మక్కయ్యారని, వారిపై ప్రైవేట్ కేసులు పెట్టి వేధిస్తున్నారని అఫిడవిట్‌లో సీబీఐ పేర్కొంది.

సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ ప్రకారం.. కేసులో నిందితులు.. దర్యాప్తు విచారణాధికారిపైనే తిరిగి కేసులు పెట్టారు. మేజిస్ట్రేట్ ముందు 164 స్టేట్‌మెంట్ ఇస్తామన్న పోలీసు అధికారి శంకరయ్యకు ఏపీ ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. ప్రమోషన్ వచ్చిన తర్వాత శంకరయ్య.. తనపై సీబీఐ ఒత్తిడి తెచ్చి, 164 స్టేట్‌మెంట్ అడిగినట్లు లేఖ రాశారు. రాష్ట్ర పోలీసులు, నిందితులు కుమ్మక్కయ్యారు. అందుకే విచారణలో జాప్యం జరుగుతోంది. హత్య జరిగిన తర్వాత నిందితులు చెప్పినట్లుగా స్థానిక పోలీసులు వ్యవహరించారు. నిందితుల్ని విచారణ జరిపి, చార్జిషీటు దాఖలు చేయాల్సిన పోలీసులు.. చార్జిషీటు ఆలస్యం చేసి వారికి సహకరించారు అని సీబీఐ కోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో పేర్కొంది. దీనిలో అన్ని అంశాల్ని పూర్తిగా వివరించినట్లుగా సమాచారం. కాగా, సునీతా రెడ్డి వాదనలు అన్నింటికీ సీబీఐ మద్దతు తెలిపింది. ఆమె చెప్పేవన్నీ నిజాలేనని స్పష్టం చేసింది.