మూలిగే నక్క మీద తాటిపండు పడ్డం అంటే ఇదే. మొన్ననే ఏదో ఆపరేషన్ అయి కోలుకుంటున్న లాలూ ప్రసాద్ యాదవ్ కు సీబిఐ షాక్ ఇచ్చింది. ఆయనపై ఉన్న అవినీతి కేసును మళ్ళీ తిరగదోడుతున్నట్టు ప్రకటించింది. మిమార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్న నెలల వ్యవధిలోనే ఇది జరగడం గమనార్హం.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైల్వే మంత్రిగా ఉన్నారు. అప్పుడు రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. దీని మీద 2018లో సీబీఐ విచారణ చేసింది. దాని విచారణ కూడా 2021లో ముగిసిపోయింది. అదే సీబిఐ ఈ ఆరోపణలపై ఎలాంటి కేసు నమోదు కాలేదని చెప్పింది. ఈ కేసులో లాలూతో పాటూ కొడుకు తేజస్వీ యాదవ్, కూతుర్లు చందా యాదవ్, రాగిణి యాదవ్ లు కూడా ఉన్నారు. ఇప్పడు ఇన్నేళ్ళ తర్వాత ఈ కేసు మీద సిబిఐ తిరిగి విచారణ ప్రారంభించింది.
మరోవైపు లాలు ప్రసాద్ యాదవ్ గత కొన్నేళ్ళుగా దాణా రుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. ఆరోగ్య కారణాల రిత్యా ఈ మధ్యనే బెయిల్ మీద బయటకు వచ్చి, కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. ఇక కొడుకు తేజస్వీ యాదవ్ జెడీయే పార్టీతో పోత్తు పెట్టుకుని ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు.