Home > Featured > ఎక్కడ మొదలెట్టాడో అక్కడే ఇలా.. పాపం చిదంబరం

ఎక్కడ మొదలెట్టాడో అక్కడే ఇలా.. పాపం చిదంబరం

మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణంలో సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారిస్తున్నారు. ఇక్కడే ఓ ఆసక్తికర విషయం ఉంది. సీబీఐ కార్యాలయం ప్రారంభానికి వచ్చిన చిదంబరం అదే చోట విచారణ ఎదుర్కోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా తనదైన స్టైల్‌లో స్పందించారు. చిదరంబరం అరెస్ట్ ప్రజాస్వామ్యానికి ప్రతిరూపం అంటూ ట్వీట్ చేశారు.

2011 జూన్‌ 30న అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో కలిసి ఆయన సీబీఐ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఒకప్పుడు కేంద్ర మంత్రి హోదాలో వచ్చిన ఆయన ఇప్పుడు నిందితుడిగా విచారణ ఎదుర్కోవడం ఆసక్తిగా మారింది. కాగా మధ్యాహ్నం 2 గంటలకు ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు.

Updated : 22 Aug 2019 12:16 AM GMT
Tags:    
Next Story
Share it
Top