వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ నేడు ముగిసింది. సుమారు 4 గంటల పాటు అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. న్యాయవాది సమక్షంలోనే ఆయన విచారణ జరిగింది. నేడు కూడా 160 సీఆర్‌పీసీ కింద విచారణ చేపట్టారు. ఈ మేరకు స్టేట్‌మెంట్‌ను సీబీఐ రికార్డు చేసింది.
వివేక హత్య కేసులో అవినాష్‌రెడ్డిని మొత్తం నాలుగు సార్లు సీబీఐ విచారించింది. జనవరి 28, ఫిబ్రవరి 24, మార్చి 10న అవినాష్‌ను విచారించిన సీబీఐ.. ఇవాళ కూడా ప్రశ్నించింది. కేసులో కీలక నిందితుడిగా అవినాష్ రెడ్డిని సీబీఐ భావిస్తోంది. ఆయనను అరెస్ట్ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. అయితే కోర్టులో తనను అరెస్ట్ చేయొద్దని, తన విచారణపై స్టే ఇవ్వాలంటూ అవినాష్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సోమవారం విచారించిన న్యాయస్థానం సీబీఐ విచారణలో తాము జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేసింది. అయితే అరెస్టు సహా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని మాత్రం ఆదేశించింది.