కాంగ్రెస్ సీఎం సోదరుడి నివాసంపై సీబీఐ దాడులు - MicTv.in - Telugu News
mictv telugu

కాంగ్రెస్ సీఎం సోదరుడి నివాసంపై సీబీఐ దాడులు

June 17, 2022

రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్ నివాసంపై శుక్రవారం దాడులు చేసింది. జోధ్‌పూర్‌లోని ఆయన నివాసంతో పాటు పలు చోట్ల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు ఆయనపై అవినీతి కేసును సీబీఐ నమోదు చేయగా, దాడులు ఇప్పుడు చేసింది. ఇది కాకుండా అగ్రసేన్ గెహ్లాట్‌పై ఈడీ గతంలో కేసు నమోదు చేసింది. 2007 – 2009 మధ్యలో పెద్ద ఎత్తున ఓ ఫర్టిలైజర్‌ను అక్రమంగా ఎగుమతి చేశారని ఈడీ ఆరోపించింది. మనీలాండరింగ్ చట్టం కింద అగ్రసేన్‌, ఆయన కంపెనీతో పాటు మరికొందరిపై ఈడీ విచారణ జరుపుతోంది. కాగా, ఓ వైపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఢిల్లీలో ఈడీ విచారిస్తుండగా, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. ఈ సమయంలో అశోక్ గెహ్లాట్ టార్గెట్‌గా సీబీఐ దాడులు చేయడం రాజకీయ కక్ష సాధింపేనని ఆ పార్టీ వారు విమర్శిస్తున్నారు. కేంద్ర తన ఆధీనంలో ఉన్న సంస్థలతో ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.