‘శుద్ధపూస’ ఈడీ అధికారి ఇంటిపై సీబీఐ దాడి - MicTv.in - Telugu News
mictv telugu

‘శుద్ధపూస’ ఈడీ అధికారి ఇంటిపై సీబీఐ దాడి

July 9, 2019

Cbi raids on former enforcement directorate

ఆయన ప్రతిష్టత్మక దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)లో ఉన్నతాధికిగా దశాబ్దాలపాటు పనిచేశారు. బోలెడు నీతులు వల్లించారు. అక్రమార్కుల భరతం పడతానని హెచ్చికలు జారీ చేశారు. కానీ ఆయన ‘శుద్ధపూస’ బండారం బయటిపడింది. సీబీఐ అధికారులు ఆయన ఇళ్లపై ఈ రోజు దాడులు చేసి అక్రమ సొత్తు బయట పెట్టించారు. ఆయన పేరు బొల్లినేని శ్రీనివాస్ గాంధీ. బీఎస్ గాంధీగా ప్రసిద్ధుడు. ఈడీలో అసిస్టెంట్‌ డైరెక్టరుగా పనిచేసి గాంధీ ప్రస్తుతం కేంద్ర జీఎస్టీ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని గడ్డి కరిచాడని ఫిర్యాదులు రావడంతో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఈడీలో 14 ఏళ్ల పనిచేసిన గాంధీ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల జప్తులో చురుగ్గా వ్యవహరిచారు. 

కళ్లు తిరిగే ఆస్తులు 

సాధారణంగా కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు అవినీతికి దూరంగా ఉంటారు. కానీ గాంధీ మాత్రం భారీగా ఆస్తులు కూడబెట్టారు. హైదరాబాద్‌, విజయవాడల్లో ఆయన ఇళ్లలో రూ.3.75 కోట్ల అక్రమాస్తులకు సంబంధించిన ఆధారాలు దొరికాయి. కూకట్‌పల్లి, మదీనాగూడ, కొండాపూర్, హైదర్‌నగర్‌, విజయవాడ, కంకిపాడు, ప్రొద్దూటూరులో భారీ స్థాయిలో  భూములు సంపాదించినట్లు తేలింది. గాంధీ తన ఇద్దరు కూతుళ్లను ఊహించనంత ఫీజులు చెల్లించి చదివించారని సీబీఐ తెలిపింది. కున్నాయి.