CBI searches 91 locations over on fake foreign medical graduates
mictv telugu

ఫేక్ డాక్టరీ సర్టిఫికెట్లు.. 91 చోట్ల సీబీఐ దాడులు..

December 29, 2022

CBI searches 91 locations over on fake foreign medical graduates

వైద్యవిద్యలో అక్రమాలపై సీబీఐ కొరఢా ఝళిపిస్తోంది. దేశవ్యాప్తంగా 91 ప్రాంతాల్లో గురువారం భారీ స్థాయిలో సోదాలు చేసింది. వందలమంది నకిలీ వైద్యవిద్య సర్టిఫికెట్లు సంపాదించి వైద్యం చేస్తున్నట్లు ఉప్పందడంతో ఆయా విద్యాసంస్థలపై ఆకస్మిక దాడులు జరిపింది. సీబీఐ ఈ నెల 23న విజయవాడలోని ఏపీ మెడికల్ కౌన్సిల్లోనూ సోదాలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే విదేశీ వైద్య పట్టభద్రుల పరీక్షలో 73 మంది ఫెయిలైనా స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లు పొందడంతో గుట్టురట్టయింది. దీనిపూ కేంద్ర ఆరోగ్య శాఖ ఫిర్యాదు చేయడంతో సీబీఐ కేసు నమోదు చేసి ఆరా తీస్తోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురి పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చింది. విదేశాల్లో వైద్యవిద్యకు సంబంధించి 2011 నుంచి నమోదైన వివరాలను, డేటాను సేకరించింది. 14 రాష్ట్రాల మెడికల్ కౌన్సిళ్లపై, 73 మంది ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్లపై కేసులు పెట్టింది.