ఈకాబోయే కలెక్టర్లకు బాబుగారే ఆదర్శమట - MicTv.in - Telugu News
mictv telugu

  ఈకాబోయే కలెక్టర్లకు బాబుగారే ఆదర్శమట

June 14, 2017

ఇప్పుడు రాయబోయే వార్త ఎవరి గురించి అనుకుంటున్నారా… టెక్నాలజీకే టెక్నాలజీ నేర్పిన గొప్ప హైటెక్ బుర్ర కలిగిన ఒక మహాజ్జాని గురించి..ఎక్కడో మూలకు నక్కి ఉన్నప్రతీదాన్ని వెలుగులోకి తీస్కచ్చి ప్రపంచపటంలో ఇరికిచ్చేందుకు విశ్వప్రయత్నంచేసే ఒక గొప్పయోధుడి గురించి,ఎత్తుకు ఎదిగిన ప్రతీఒక్కర్ని తానే ప్రోత్సహించి పైకితీసుకొచ్చానని సగర్వంగా చెప్పుకొనే ఒక ఇన్స్ ప్రేషన్ గురించి…ఇంతకీ ఆయన ఎవరో తెలిసిందా ఆ..కరక్ట్ చంద్రబాబు సార్ గురించే… అస్సలు ముచ్చటేందంటే ఆల్ ఇండియా లెవల్ లో మంచి ర్యాంకులు సాధించిన ఐఎస్ ర్యాంకర్లను సన్మానించేందుకు ఆంద్రప్రదేశ్ లో ఒక మీటింగ్ వెట్టిన్రు మరి ఆమీటింగులో బాబుగారు చెప్పిన గొప్పవిషయాలు అన్నీ ఇన్నీకావు…ఎందరికో స్పూర్తినిచ్చేవి. ఐఎఎస్ ర్యాంకర్ల గురించి అబ్బబ్బ ఏమన్న జెప్పిండా సారు…వాళ్లు ర్యాంకు సాధించిన ఆనందంకంటే  చంద్రాలుసారు వాళ్లగురించి చెబుతుంటే కలిగిన కిక్కే వాళ్లకు ఎక్కువేమో,

బాబుకు కాబోయే ఐఎఎస్ కితాబు..

ఇన్నాళ్లు బాబుగారు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు అని అనుకునెటోళ్లకు కనువిప్పు కలిగేలా బాబుగారి గురించి ఐఎఎస్ ర్యాంకర్లు చెబుతుంటే వినాలె…అబ్బబ్బ దగ్గరుంటే వాళ్లకు దండంబెట్టి సీటీలు కొడ్తారేమో…ఐఎఎస్ ఆరవ ర్యాంకచ్చిన దినేశ్  అయితే బాబుగారిని దగ్గరనుంచి చూడడానికే నేను కష్టపడి ఐఎఎస్ చదివాను అని చెప్పకనే చెప్పాడు.ఆంధ్రప్రదేశ్ అంటె చంద్రబాబు చంద్రబాబంటే ఆంద్రప్రదేశ్ అని ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు అనే నానార్ధాన్ని కనిపెట్టాడు,ఇగ మూడవ ర్యాంకు తెచ్చుకున్న గోపాల కృష్ణ నేను బాబుగారిలాగే హైటెక్ వేలో యూట్యూబ్ లో ఆయన మాట్లాడిన స్పీచ్ వింటూ కష్టపడి చదివాను ఇవ్వాళ్ల ఇంతవాన్నయ్యి ఇక్కడ నిలుచున్నానంటే కారణం బాబుగారే అని చెబుతుంటే…చంద్రబాబు గారి కళ్లల్లో వచ్చిన స్పార్క్ అంతా ఇంతాకాదు..అది స్పార్క్ కాదు ఇందరికి నేను ఆదర్శమయ్యానా అనే సంతోషంలోంచచ్చిన ఒక గర్వం.కనీ కాబోయే కలెక్టర్లలందరూ రామకోటిలాగ బాబుకోటి జపం చేసిండ్రు అని అనుకుంటే అది మీపప్పులో మీరు కాలేసుకున్నట్టే…వాళ్లను ప్రభావితంచేసిన గొప్పవ్యక్తిగారట చంద్రబాబు సారు…స్వయంగా కాబోయే కలెక్టర్లే చెప్పినా నమ్మకపోతే మీఇష్టం.కనీ ఈకాబోయే కలెక్టర్లందరు రేపు కొల్వులోకి ఎక్కినంక  చంద్రాలు సారు ఆద్వర్యంలో డ్యూటీ చేస్తుంటే పబ్లిక్ దశ దిశ ఎలా మారబోతుందో ఏమో.. మీ ఊహకూడా అందడంలేదు కదా…దటీజ్ హైటెక్ మనుషుల పవ