బలవంతపు చదువులతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారనే ఆలోచనల నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) తన పరిధిలోకి వచ్చే పాఠశాలలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఏప్రిల్ 1వ తేదీ వరకు స్కూల్స్ ను తెరవొద్దని సూచించింది. తాము జారీ చేసిన అకడమిక్ క్యాలండర్‌ను కచ్చితంగా పాటించాలని హెచ్చరించింది. ఈ విద్యా సంవత్సరంలో ముందే తరగతులను ప్రారంభిస్తున్నారన్న వార్తలు నేపథ్యంలో స్కూళ్లకు CBSE స్పష్టం ఆదేశాలు జారీ చేసింది.ఏప్రిల్ 1వ తేదీ కన్నా ముందు తరగతులు ప్రారంభిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. అకడమిక్ క్యాలండర్ ను ఫాలో కాకుండా, ముందే స్కూల్స్ ను ప్రారంభించడం వల్ల విద్యార్థులపై అనవసరంగా అదనపు ఒత్తిడి పడుతుందని CBSE తెలిపింది.అకడమిక్స్ తో పాటు ఆరోగ్యం, ఫిజికల్ ఎడ్యుకేషన్, వర్క్ ఎడ్యుకేషన్, కమ్యూనిటీ సర్వీస్ లు విద్యార్థులకు చాలా అవసరమని బల్లగుద్ది చెప్పింది. ముందే తరగతలు ప్రారంభిస్తే విద్యార్థుల ఇతర లైఫ్ స్కిల్స్ నేరుకునే అవకాశాలు లేకండా పోతుందని వెల్లడించింది. ప్రస్తుతం సీబీఎస్ 10th, 12th పరీక్షలు జరుగుతుండగా 10th క్లాస్ మార్చి 21తో, 12th క్లాస్ ఏప్రిల్ 5తో పూర్తవుతాయి