సీబీఎస్ఈ(CBSE) 10, 12 తరగతులకు పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం పదోతరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మొదలై మార్చి 21వరకు కొనసాగనుండగా.. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న మొదలై ఏప్రిల్ 5వరకు జరుగుతాయని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. కాగా.. 12వ తరగతి పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు జరిగింది. ఏప్రిల్ 4న జరగాల్సిన పరీక్షలను మార్చి 27నే నిర్వహించనున్నారు. ఈ మేరకు సవరించిన షెడ్యూల్ను సీబీఎస్ఈ తాజాగా విడుదల చేసింది. కేవలం ఒకరోజు జరిగే పరీక్ష తేదీలో మాత్రమే మార్పు జరిగిందని సీబీఎస్ఈ వెల్లడించింది. 12వ తరగతి మిగతా పరీక్షలు, పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఈ నెల 29న ప్రకటించినట్లుగానే ఉంటుందని స్పష్టం చేసింది.
సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మొదలై మార్చి 21వరకు కొనసాగనుండగా.. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న మొదలై ఏప్రిల్ 5వరకు జరుగుతాయని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 10.30గంటలకు మొదలవుతాయని వెల్లడించింది.. రెండు సబ్జెక్టుల మధ్య తగినంత గ్యాప్ ఇవ్వడంతో పాటు జేఈఈ మెయిన్ వంటి పోటీ పరీక్షలను పరిగణనలోకి తీసుకొని డేట్ షీట్లను తయారు చేసినట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలిపింది. మారిన షెడ్యూల్ వివరాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి. https://www.cbse.gov.in/cbsenew/documents//Date_Sheet_Session_2022_23_30122022_Updated.pdf