Home > Featured > సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల

సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల

CBSE Result 2022: CBSE Class 10th result announced, direct link

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం బోర్డు ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లు https://cbseresults.nic.in, https://cbse.digitallocker.gov.in/, https://cbse.gov.in ద్వారా తెలుసుకోవచ్చని బోర్డు వెల్లడించింది. విద్యార్థులు తమ రోల్‌ నంబర్‌, పుట్టిన తేదీ, స్కూల్‌ నంబర్లతో ఈ ఫలితాలను పొందవచ్చు. కాగా.. ఈ ఉదయమే సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.

సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 26 నుంచి మే 24 వరకు జరిగాయి. దేశవ్యాప్తంగా 7,046 సెంటర్లలో జరిగిన ఈ పరీక్షలకు 21,16,209 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 8,94,993 మంది బాలికలు కాగా.. 12,21,195మంది బాలురు. విద్యార్థులను తమ ఫలితాను ఈ క్రింది విధంగా చెక్ చేసుకోవచ్చు.

• మొదటిగా అధికారిక వెబ్ సైట్ https://cbseresults.nic.in/ ను ఓపెన్ చేయాలి.
• అనంతరం హోం పేజీలో Secondary School Examination (Class X) Results 2022 లింక్ పై క్లిక్ చేయాలి.
• రిజల్ట్స్ పేజీ ఓపెన్ అయ్యాక.. ఆ పేజీలో రూల్ నంబర్, స్కూల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్మిట్ కార్డ్ ఐడీ నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
• దీంతో మీ రిజల్ట్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
• కాపీని ప్రింట్ తీసుకోవచ్చు.

Updated : 22 July 2022 4:31 AM GMT
Tags:    
Next Story
Share it
Top