నేటి నుంచి సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) పదో తరగతి, 12వ తరగతి వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు 26 విదేశాలకు చెందిన మొత్తం 38,83,710 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు పరీక్షలు జరుగుతాయని ఎగ్జానేషన్ కంట్రోలర్ డాక్టర్ సన్యం భరద్వాజ్ తెలిపారు.
అయితే పరీక్షల నేపథ్యంలో చాట్ జీపీటీ వాడకంపై నిషేదం విధించింది (సీబీఎస్‌ఈ)బోర్డు. ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షల్లో విద్యార్ధులు ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైస్ లు వాడొద్దని సూచించింది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు, చాట్ జీపీటీ వాడకంపై నిషేదం విధించింది. ఈ మేరకు ఒక సర్కులర్ జారీ చేసింది. పరీక్షల్లో పాస్ అయ్యేందుకు అక్రమ మార్గాలను అనుసరించడంపై విద్యార్ధులను సీబీఎస్ఈ హెచ్చరించింది. ఎగ్జామ్స్ అడ్మిషన్ కార్డులో సైతం పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడకూడదని, ఒకవేళ ఎవరైనా అలా చేస్తే బోర్డు నిబంధనలు అనుసరించి చర్యలు చేపడతామని సీబీఎస్ఈ స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఎవరి నోట విన్నా చాట్ జిపీటినే వినిపిస్తోంది. అవసరమైన సమాచారాన్ని క్షణాల్లో అందించే ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీతో మేలు ఎంత ఉందో, అదేస్థాయిలో దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.