CCI imposed a fine of Rs. 1338 crores to Google
mictv telugu

గూగుల్‌కి భారీ జరిమానా విధించిన భారత్

October 21, 2022

ప్రముఖ సెర్చింజన్ సంస్థ, టెక్ దిగ్గజం గూగుల్‌కి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) భారీ జరిమానా విధించింది. మార్కెట్లో ఉన్న తన ఆధిపత్యాన్ని గూగుల్ దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలపై రూ. 1338 కోట్లను జరిమానాగా విధించింది. అంతేకాక, అనుచిత వ్యాపార విధానాలు అమలు చేయడం మానుకోవాలని హెచ్చిరించింది. ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు సీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ ఫోన్లలో ఉపయోగించే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు గూగుల్ మొబైల్ సూట్‌ను కూడా పొందపరిచేలా షరతు విధిస్తుందన్న ఆరోపణలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్ ఇన్‌స్టాల్ చేసే ఆప్షన్ లేకుండా ప్రి ఇన్‌స్టాల్ చేయాలనడం అసమంజసమని సీసీఐ చైర్ పర్సన్ అశోక్ కుమార్ ఆదేశాల్లో వెల్లడించారు. కాగా, అశోక్ కుమార్ ఈ నెల 25న పదవీ విరమణ చేయనుండడం గమనార్హం.