టాయిలెట్లో సీసీ కెమెరాలు.. నిరాహార దీక్ష చేస్తా : ప్రొఫెసర్ - MicTv.in - Telugu News
mictv telugu

టాయిలెట్లో సీసీ కెమెరాలు.. నిరాహార దీక్ష చేస్తా : ప్రొఫెసర్

May 16, 2022

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న నేరారోపణలపై ప్రొఫెసర్ సాయిబాబా ప్రస్తుతం నాగపూర్ జైలులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన వాడుతున్న టాయిలెట్‌లో సీసీ కెమెరాలు ఉన్న విషయం బయటపడింది. వీటిని అధికారులే ఏర్పాటు చేయడం గమనార్హం. దీన్ని గమనించిన ప్రొఫెసర్ సాయిబాబా తన మరుగుదొడ్డిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను తొలగించాలని అధికారుల వద్ద పట్టుబడుతున్నారు. లేకపోతే జైలులోనే నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇదే విషయంపై ఆయన కుటుంబ సభ్యులు మహారాష్ట్ర హోం మంత్రికి ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలు పెట్టి అధికారులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.