cctv footage of a man kicking the child
mictv telugu

ఎంత క్రూరం..కారుపై చిన్నారి వాలాడని…

November 4, 2022

పేద, మధ్యతరగతి కుటుంబానికి చెందిన చిన్నారులకు కారు అంటే సరదా..కారును చూసి మురిసిపోతూ ఉంటారు. రోడ్డుపై కారు కనిపిస్తే ఓ సారి అలా చేయి వేసి ముచ్చటపడిపోతుంటారు.అయితే కారుపై ఓ చిన్నారి వాలాడని యజమాని కర్కశంగా ప్రవర్తించాడు. ఆరేళ్ల బాలుడిని కాలుతో తన్ని తన మూర్ఖత్వాన్ని ప్రదర్శించాడు. అతడి ప్రవర్తనతో బిక్కుమంటూ భయంతో అక్కడి నుంచి చిన్నారి వెళ్లిపోయాడు. ఆ ఘటన చూసిన స్థానికులు కారు యజమానిపై తిరగబడ్డారు. రోడ్డుపై అతనిని నిలిదీసి అడగడంతో అక్కడి నుంచి పారిపోయాడు. కేరళలో చోటుచేసుకున్న ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ ఘటనపై పోలీసులు సరిగ్గా స్పందించలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఆ ఘటనను అక్కడే విధుల్లో ఉన్న పోలీస్‌కు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో సీసీ ఫుటేజ్ వైరల్ అవ్వడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. నిందితుడి కోసం గాలించి అతడిని అరెస్ట్ చేసారు. అయతే కాసేపటికే అతనిని వదిలేసారని వార్తలు వచ్చాయి..దీంతో జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.. సోషల్ మీడియా వేదికగా అతనిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. దీంతో కేరళ స్పీకర్, విద్యాశాఖమంత్రి స్పందించి నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టాలని పోలీసులను కోరారు.బాధిత చిన్నారి రాజస్థాన్ నుంచి వచ్చిన వలస కూలి కుటుంబానికి చెందిన వాడిగా తెలుస్తోంది. నిందితుడు పొన్నియపాలెంకు చెందిన హిహెషద్ గా గుర్తించారు.