CCTV video emerges of jailed Delhi minister Satyendar Jain getting a massage inside Tihar jail
mictv telugu

మంత్రికి జైలులో మసాజ్..వీడియాపై కలకలం

November 19, 2022

ఢిల్లీ ఆప్ మంత్రి మసాజ్ వీడియో బయటకొచ్చింది. తీహార్ జైలులో మంత్రి సత్యేంద్ర జైన్ వీఐపీ ట్రీట్ మెంట్ పొందుతున్నారు. జైలు రూల్స్ తుంగలో తొక్కి కటకటాల్లో రాజభోగాలు అనుభవిస్తున్నారు. మంత్రి సత్యేంద్ర జైన్ మసాజ్ చేయించుకుంటున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.మంత్రి నిర్వాకంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ రియాక్షన్ ఏంటో చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

మసాజ్ మస్తీ

మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ మే30న అరెస్ట్ అయ్యారు.ఈయనతోపాటు కుటుంబసభ్యులపై ఈడీ అభియోగాలు మోపింది. ప్రస్తుతం సత్యేంద్ర జైన్ తీహార్ జైలులో ఉన్నారు.వీఐపీ ట్రీట్ మెంట్ పొందుతున్నారని ఈడీ కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది. ఇది జరిగిన కొన్ని రోజులకే మంత్రి మసాజ్ చేయించుకుంటోన్న వీడియో బయటకొచ్చింది. ఓ వ్యక్తి మంత్రి తల, కాళ్లకు మసాజ్ చేస్తున్నట్టు అందులో ఉంది. ప్రత్యేక సదుపాయలతో పాటు పక్కనే మినరల్ వాటర్ బాటిల్స్ బాక్స్ ఉంది. జైలు రూల్స్ ను పూర్తిగా బ్రేక్ చేశారని వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. ఈ వీడియోలు శనివారం జాతీయ చానళ్లలో చక్కర్లు కొట్టాయి. సెప్టెంబర్ 11న రికార్డ్ అయిన వీడియో ఇది.

రూల్స్ బ్రేక్

ఈ వీడియోలను ట్విట్టర్‌లో బీజేపీ నేతలు ట్యాగ్ చేశారు. మంత్రి మసాజ్ పై కేజ్రీవాల్ రియాక్షన్ ఏంటని నిలదీశారు. ఈ వీడియోలపై సమాధానం చెప్పితీరాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. తీహార్ జైలులో మంత్రి సత్యేంద్రజైన్ నిబంధనలు ఉల్లంఘించారన్నారు. దీనిపై జైలు అధికారులు సమాధానం చెప్పాలంటున్నారు.

జైలు అధికారి సస్పెండ్

ముగ్గురు నిందితులు హెడ్ కౌంట్ సమయంలో ఒకే రూమ్ లో ఉన్నారని జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ చెబుతున్నారు. మంత్రి సత్యేంద్ర జైన్‌ను కలువడానికి బయటనుంచి ఎవరూ రాలేదని అంటున్నారు. మసాజ్ వీడియోలు బయటకు రావడం, బీజేపీ ఆరోపణలతో సూపరింటెండెంట్‌ అజిత్ కుమార్‌ను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.