CEC was serious on munugode Returning Officer about simble change
mictv telugu

మునుగోడులో గుర్తు మార్పు.. తిరిగి కేటాయిస్తూ ఈసీ ఉత్తర్వులు

October 20, 2022

CEC was serious on munugode Returning Officer about simble change

మునుగోడు ఉప ఎన్నికలో రోడ్డు రోలర్ గుర్తు మార్పుపై కేంద్ర ఎన్నికల సంఘం రిటర్నింగ్ అధికారిపై సీరియస్ అయ్యింది. లేని అధికారాన్ని వినియోగించి బేబీ వాకర్ గుర్తు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో గురువారం సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

రోడ్డు రోలర్ గుర్తును తిరిగి యుగతులసి పార్టీ అభ్యర్ధి కె. శివకుమార్‌కు కేటాయించింది. ఫారం 7(ఎ)ను సవరించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో మారిన గుర్తులతో బ్యాలెట్ పేపర్ ముద్రణ చేపట్టనున్నారు. అంతకుముందు గుర్తు మార్పుపై కె. శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కనీసం అభ్యర్ధికి సమాచారం ఇవ్వకుండా, అధికార పార్టీకి కొమ్ముకాస్తూ రోడ్డు రోలర్ బదులు బేబీ వాకర్ గుర్తు కేటాయించారని లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. దీంతో పరిశీలించిన ఈసీఐ.. తాజాగా చర్యలకు ఉపక్రమించింది. రిటర్నింగ్ ఆఫీసర్ వివరణ సంతృప్తికరంగా లేకపోతే వేటు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.