మనదేశంలోని ఇప్పటికీ కొన్నిగ్రామాలు కరెంట్ వెలుగు చూడలేదు. కాశ్మీర్‌లోని ఒక లోయ ప్రాంతంలో స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాలకు ఇప్పటికి వెలుతురు వచ్చింది.
కాశ్మీర్ లోని అనేక గ్రామాలు కలప, ఇతర సహజ వనరుల నుంచి పొందిన శక్తితో తమ జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలు మాత్రమే అధిక శక్తితో కూడిన విద్యుత్ తో నడుస్తున్నాయి. సంవత్సరాల ప్రయత్నాల తర్వాత కాశ్మీర్ లోయలోని మరో గ్రామం చివరకు వెలుగు చూస్తున్నది.
దేశంలోని ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరమైన సౌకర్యంగా చూస్తారు. కానీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా.. ఇంటి నెట్ వర్క్, కనెక్టివిటీ లేకుండా ఒక గ్రామం ఇన్ని సంవత్సరాలు ఉంది. ఎట్టకేలకు ఆ గ్రామం మొదటిసారి బల్బులు వెలుగులు వచ్చాయి. దశాబ్దాలుగా అలుముకున్న చీకట్లు తొలగిపోవడంతో గ్రామస్తులు ఆనందంలో సంబరాలు చేసుకుంటున్నారు. 60 ఇళ్లు ఉన్న ఈ గ్రామంలో విద్యుత్తును ఉత్పత్తి చేసే ఒక ట్రాన్స్ఫర్మర్ ఉంచారు.
విద్యుత్తు అభివృద్ధి శాఖ టెక్నికల్ అధికారి ఫయాజ్ అహ్మద్ సూఫీ..‘గ్రామంలో కనెక్టివిటీని ఇవ్వడానికి 38 హైటెన్షన్ లైన్లు, 57 ఎల్ఈటీ స్తంభాలతో ట్రాన్స్ఫార్మర్ ను ఇప్పుడు టెథాన్ గ్రామంలో ఏర్పాటు చేశాం. అనంత నాగ్ కొండలపై ఉన్న ఈ గ్రామానికి గత 75యేండ్లుగా విద్యుత్ లేదు. ఇన్ని సంవత్సరాలు.. కలప, దీపాలు, క్యాండిల్ లైట్‌ను ఉపయోగించారు. విద్యుత్ శాఖ, జిల్లా పరిపాలన అవిశ్రాంత ప్రయత్నాల కారణంగా కేంద్ర ప్రాయోజిత డెవలప్ మెంట్ ప్యాకేజీ పథకం కింద ఈ ఊరికి కరెంట్ వచ్చింది’ అని తెలియచేశారు.
అనంత్ నాగ్ పట్టణానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి విద్యుత్ ను తీసుకురావడం అంత ఈజీ కాలేదు. ప్రజల సమష్టి కృషి, పరిపాలన తర్వాతే ప్రజలకు ఇప్పుడు విద్యుత్తు అందింది. ఆ ఊరిలో ఒక వ్యక్తి.. ‘మేం ఈ రోజు మొదటిసారిగా కరెంట్ చూశాం. మా పిల్లలు ఇప్పుడు వెలుగులో చదువుతారు.
మేం ఎదుర్కొటున్న అనేక సమస్యలకు ముగింపు వచ్చింది’ అని ఆనందం వ్యక్తం చేశాడు. గ్రామంలో నెట్ వర్కింగ్ ప్రక్రియ 2022 ప్రారంభంలో ప్రారంభమైంది. అయితే ఇంధన శాఖ ప్రకారం.. హై టెన్షన్ లైన్ ట్యాపింగ్ వంటి అనేక సమస్యలు వచ్చాయి. మొత్తానికి అన్ని సమస్యలు తొలగిపోయి ఆ ఊరికి కరెంట్ వచ్చింది.