హైదరాబాద్ వేదికగా ఈ – ఫార్ములా ప్రధాన రేసు ప్రారంభమైంది. భారత్ దేశంలోనే మొదటిసారిగా జరుగుతున్న ఈ రేసును చూసేందుకు ప్రముఖులు భారీగా తరలివరావడం నగరంలో సందడి నెలకొంది. కేటీఆర్, రామ్‌చరణ్‌తో పాటు నారా బ్రాహ్మణి, నందమూరి ప్రణతి, నమ్రత వంటి, సెలబ్రిటీలు పోటీలను వీక్షించేందు వచ్చారు. మరోవైపు భారత్ క్రికెటర్లు కూడా రావడం అభిమానుల్లో ఉత్సాహం నింపింది. సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్, దీపక్ చాహర్‌లు రేస్‌ను వీక్షిస్తున్నారు. టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ పక్కనే సచిన్ కూర్చుని ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. భారత్ నుంచి పోటీలో మహీంద్ర రేసింగ్, టీసీఎస్ జాగ్వార్‌లు పోటీలో నిలిచాయి.