celebs spotted at 80s actors' reunion hosted by Jackie Shroff
mictv telugu

ఒకే ఫ్రేమ్‌లో 80ల నాటి హీరోహీరోయిన్లు..

November 14, 2022

సినీ పరిశ్రమలోని హీరో, హీరోయిన్ల మధ్య మంచి అనుబంధం ఉంటుంది. ఒకే ఫ్రేమ్ లో మనకు నచ్చిన స్టార్స్‌ అందరూ ప్రత్యక్షమైతే చూడముచ్చటగా ఉంటుంది. ఒకే ఫ్రేమ్‌ లో హీరో హీరోయిన్లు కనిపించి ఫ్యాన్స్‏ను ఆశ్చర్యపరిచారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఎయిటీస్ స్టార్స్ రీయూనియ‌న్ పేరుతో గ‌త కొన్నేళ్లుగా అల‌నాటి స్టార్స్ ప్రతి ఏడాది ఓ స్పెష‌ల్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. 2019లో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో తెలుగు, తమిళం, మలయాళం, హిందీకి చెందిన నాటి నటులు ఒక్కచోటుకు చేరి ఆడి పాడారు. అయితే 2020, 2021లో కరోనా కారణంగా గెట్ టు గెదర్ నిర్వహించలేదు. రెండేళ్ల తరువాత మళ్లీ వీరంతా కలుసుకుని ఎంజాయ్ చేశారు. ఈసారి బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీష్రాఫ్ ఇంట్లో కలుసుకోవడం ఆసక్తిగా మారింది. అయితే ఇందులో ప్రముఖ నటులు నాగార్జున, బాలకృష్ణ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమానికి జాకీ ష్రాఫ్, పూనమ్ ధిల్లాన్ హోస్ట్‌గా వ్యవహరించారు.

ఈ వేడుక‌లో ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌కు చెందిన 80వ ద‌శ‌కానికి చెందిన‌ హీరోలుహీరోయిన్లు అంద‌రూ పాల్గొన్నారు. ఆట పాట‌ల‌తో సంద‌డి చేశారు. వారి ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. ఈ వేడుక‌లో చిరంజీవి, వెంక‌టేష్‌, అనుప‌మ్ ఖేర్‌, శ‌ర‌త్‌కుమార్‌, భానుచంద‌ర్‌, అర్జున్‌, అనిల్‌క‌పూర్, రేవ‌తి, సుమ‌లత‌, న‌దియా, సుహాసిని, జ‌య‌ప్రద‌, రాధ‌, శోభ‌న‌, న‌రేష్ , రాజ్‌ బబ్బర్‌, విద్యాబాలన్‌, టీనా అంబానీ, మీనాక్షి శేషాద్రి, ఖుష్బూ, త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ వేడుకకు మొత్తంగా 25 మందికిపైగా నటులు హాజరయ్యారని సమాచారం. మొత్తంగా వీరికి ఇది 11వ రీయూనియన్‌ కావడం గమనార్హం. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దశబ్దాల నాటి స్నేహాన్ని, నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈ రీయూనియన్‌ను కూడా ఎంజాయ్‌ చేశారట.