ప్రజ్ఞాపూర్‌లో దొంగోడి ప్రతిభ.. న్యూస్ పేపర్ అడ్డుపెట్టి.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రజ్ఞాపూర్‌లో దొంగోడి ప్రతిభ.. న్యూస్ పేపర్ అడ్డుపెట్టి..

December 13, 2019

Cell Phone02

ప్రయాణాల్లో దొంగల చేతి వాటం మామూలుగా ఉండదు. మూడో కంటికి తెలియకుండా తమ కళను బయటపెట్టుకుంటారు.చేతికి మట్టి అంటకుండా వారు అనుకున్న పని ముగించుకొని వెళ్తారు. అలాగే. ఇద్దరు జేబు దొంగలు తమ చేతివాటాన్నిచాలా పక్కాగా అమలు చేశారు. అంతా చూస్తుండగానే ఏం తెలియనట్టుగా వచ్చి ప్రయాణికుడి జేబులో ఉన్న సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లారు. బస్సు ఎక్కినట్టుగా నటించి  సైలెంట్‌గా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. చోరకళలో ఆరితేరిన ఇద్దరు దొంగల వ్యవహారం హైదరాబాద్‌లోని ప్రజ్ఞాపూర్ బస్టాండ్‌లో చోటు చేసుకుంది. అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో ఇది రికార్డు కావడంతో వారి దొంగ తెలివికి అంతా ఆశ్చర్యపోతున్నారు. 

చౌర్యంలో ఆరితేరిన ఈ ఇద్దరు దొంగలు ఈ రోజు బస్ ఎక్కుతున్న ఒక ప్రయాణికుడి నుండి ఒక పేపర్ అడ్డుగా పెట్టి ఫోన్ ను కొట్టేసాడు బస్ ఎక్కాలనే సాకుతో మరో దొంగ బస్ ఎక్కే ప్రయాణికుడి కి సద్దు తగులతు ఫోన్ కొట్టేయగానే ఏమి తెలియనట్టు బస్ ఎక్కకుండా ఉడాయించాడు! ఇదిచొర కళ ప్రజ్ఞాపూర్ లో ఈ రోజు

Posted by Sumithra Diagnostics Gajwel on Thursday, 12 December 2019

ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ప్రజ్ఞాపూర్ బస్టాండ్‌లో బస్సు ఎక్కేందుకు వచ్చారు. ఓ బస్సు రావడంతో ప్రయాణికులతో పాటు వాళ్లు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా నటించారు. అందులో ఓ వ్యక్తి తెలివిగా చేతిలో ఉన్న పేపర్ అడ్డుట్టి జేబులో ఫోన్ తస్కరించాడు. మరో వ్యక్తి ప్రయాణికుడి దృష్టిని మరల్చే ప్రయత్నం చేశాడు. ఇది గుర్తించని బాధితుడు సిద్దూ హడావిడిగా బస్సు ఎక్కాడు. తీరా చూస్తే ఫోన్ పోయిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీ పరిశీలించగా దొంగలు కెమెరాకు చిక్కారు. వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు.