Home > విద్య & ఉద్యోగాలు > బాసర ట్రిపుల్ ఐటీలో సెల్‌ఫోన్లపై నిషేధం.. ఆదేశాలు జారీ

బాసర ట్రిపుల్ ఐటీలో సెల్‌ఫోన్లపై నిషేధం.. ఆదేశాలు జారీ

తమ డిమాండ్ల సాధన కోసం ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు రోడ్డెక్కడం తెలిసిందే. అనంతరం కలుషిత ఆహారం వల్ల విద్యార్ధులు అస్వస్థతకు లోనై ఆస్పత్రి పాలయ్యారు. దీంతో విద్యార్ధులు మరోసారి నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో ఇన్‌ఛార్జ్ వీసీ వెంకటరమణ కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని తరగతి గదులు, అకడమిక్ బ్లాకులు, పరిపాలనా భవనాల్లో సెల్‌ఫోన్లను నిషేధించారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. వీసీ తాజా నిర్ణయంతో విద్యార్ధి సంఘాలు భగ్గుమంటున్నాయి. నిరసనలను, డిమాండ్లను తీర్చలేక విద్యార్ధుల అణచివేతకు పాల్పడుతున్నారని స్టూడెంట్ గవర్నెన్స్ కౌన్సిల్ మండిపడింది.

Updated : 24 July 2022 5:07 AM GMT
Tags:    
Next Story
Share it
Top