కేన్స్ లో కెవ్వు కేక - MicTv.in - Telugu News
mictv telugu

కేన్స్ లో కెవ్వు కేక

May 20, 2017

 

కేన్స్ 70వ ఫిల్మ్ ఫెస్టివల్ లో బాలీవుడ్ ,టాలీవుడ్ తారలు సందడి చేస్తున్నారు. క్వీన్ డ్రెస్సులో ఐశ్వ‌ర్యారాయ్ కేన్స్ ఫెస్టివ‌ల్‌లో తళక్కున మెరిసింది.
సాహ‌స‌గాథ‌లో యువ‌రాణిలా,సిండ్రిల్లా క్యూటీగా కేన్స్ రెడ్‌కార్పెట్‌పై సంద‌డి చేసింది.

శృతి హసన్ అబు జానీ సందీప్ కోస్లా శారీ ధ‌రించిన రెడ్ కార్పెట్ పై న‌డిచింది. ఈ అమ్మ‌డి లుక్ ని చూసి కేన్స్ ప్రేక్ష‌కులు థ్రిల్ అయ్యారు. సంఘ‌మిత్ర టీం తోపాటు ఎఆర్ రెహ‌మాన్ , సాబు సిరిల్, జ‌యం ర‌వి, ఆర్య‌లు కూడా రెడ్ కార్పెట్ ద‌గ్గ‌ర సంద‌డి చేశారు. తెలుగు, త‌మిళం, హిందీ , కన్నడ భాష‌ల‌లో సంఘ‌మిత్ర చిత్రాన్ని తీస్తున్నారు.