Censor board banned Sitaramam's movie in Gulf
mictv telugu

సీతారామం సినిమాకు షాక్.. బ్యాన్ విధించిన సెన్సార్ బోర్డు

August 4, 2022

ప్రేమ కథా చిత్రాల దర్శకుడు హనురాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం సీతారామం. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, మరాఠీ నటి మ‌ృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందన్నా ప్రత్యే పాత్రలో నటించారు. శుక్రవారం రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ చిత్రానికి అనూహ్యంగా సెన్సార్ బోర్డు గల్ఫ్ దేశాల్లో విడుదల చేయడానికి అనుమతినివ్వలేదు. మతపరమైన అంశాలు ఉండడంతో నిషేధం విధించారని సమాచారం. దీంతో మరోసారి చిత్ర బృందం సెన్సార్ బోర్డును కలవబోతున్నారు. అభ్యంతకర సన్నివేశాలుంటే తొలగించడానికి మేకర్స్ సిద్ధపడుతున్నారు. సినిమా విడుదలకు ఇంకా కొన్ని గంటలే గడువు ఉండడంతో ఏం జరుగుతుందనే ఆసక్తి నెలకొంది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. బుధవారం జరిగిన ప్రిరిలీజ్ ఈవెంట్లో గ్లోబల్ స్టార్ ప్రభాస్ పాల్గొనడం తెలిసిందే.