Center allotted 630 PG medical seats to AP
mictv telugu

ఏపీకి 630 పీజీ వైద్య సీట్లు కేటాయించిన కేంద్రం

November 29, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైద్యకళాశాలలో పీజీ సీట్లు పెరగనున్నాయి. పీజీ వైద్య సీట్ల కేటాయింపులో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీకి 630 పీజీ సీట్లు కేటాయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్నాయి. ఆయా కాలేజీలు రెండు నెలల కిందట సెంట్రల్ స్పాన్సర్ షిప్ కింద 688 సీట్లకు ప్రతిపాదన పంపించాయి. ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ 630 పీజీ సీట్లకు ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ అండర్ సెక్రటరీ చందన్ కుమార్ ఏపీ ప్రభుత్వానికి అనుమతిస్తూ లేఖ రాశారు. ఎంవోయూ పంపిస్తున్నామని, దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాలేజీల వారీగా ఎంవోయూకు ఆమోదం తెలపాలని సూచించారు.

కాలేజీల వారీగా కొత్త వచ్చిన పీజీ సీట్లు వివరాలు

ఏఎంసీ, విశాఖ -128
జీఎంసీ, ఒంగోలు-79
ఎస్వీఎంసీ, తిరుపతి -75
సిద్ధార్థ, విజయవాడ-71
జీఎంసీ, కడప-69
జీఎంసీ,అనంతపురం 65
ఆర్ఎంసీ, కాకినాడ 46
కేఎంసీ, కర్నూలు 41
జీఎంసీ, గుంటూరు 34
జీఎంసీ, శ్రీకాకుళం 17
ఏసీఎస్ఆర్, నెల్లూరు 05