Center approves 6.05L tonnes of parboiled rice from Telangana
mictv telugu

దిగొచ్చిన కేంద్రం.. ఉప్పుడు బియ్యం కొనుగోలుకు ఓకే

May 12, 2022

Center approves 6.05L tonnes of parboiled rice from Telangana

మొత్తానికి ఉప్పుడు బియ్యం విషయంలో కేంద్రం మెత్తబడింది. రాష్ట్ర ప్రభుత్వం మేరకు గడిచిన యాసంగి బియ్యం తీసుకునేందుకు కేంద్రం అంగీకరించింది. వరి ధాన్యం, ఉప్పు బియ్యం కొనుగోలు విషయంలో తెలంగాణ సర్కారు, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. ఉప్పుడు బియ్యం కొనేది లేదని కేంద్రం తేల్చిచెప్పగా.. ఈ యాసంగి సీజన్లో తెలంగాణ ప్రభుత్వమే వరి ధాన్యం కొనుగోలు చేస్తోంది. గత ఏడాదికి సంబంధించి 6.05 లక్షల టన్నుల పోషకాల ఉప్పుడు బియ్యం తీసుకుంటామని కేంద్రం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప్పుడు బియ్యం తీసుకోవాల్సిందిగా గత నెల 28 న కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశానని అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

గత యాసంగి సీజన్లో 92.34 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసింది. అందులో నుంచి 62.52 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉంది. సాధారణ బియ్యం ఇవ్వడానికి ముందుకు రాని మిల్లర్లు.. 56.47 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం ఇచ్చారు. దీంతో ఫోర్టిఫైడ్‌ బాయిల్డ్‌ రైస్‌ ఇస్తామంటూ కేంద్రానికి కేసీఆర్ సర్కారు అనేకసార్లు లేఖలు రాసింది. కానీ కేంద్రం మాత్రం అంగీకరించలేదు. దీంతో ఈ విషయమై సీఎం కేసీఆర్, మంత్రులు ఘాటుగా స్పందించారు. బీజేపీ నేతలు సైతం అలాగే బదులిచ్చారు. బాయిల్డ్ రైస్ తీసుకోవడానికి కేంద్రం అంగీకరించడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ వివాదానికి తెరపడినట్లయింది.