వైద్య విద్య కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజబులిటీ ఎంట్రన్స్ టెస్ట్) లో కేంద్రం కీలక మార్పు చేసింది. ఇప్పటి వరకు నీట్ రాయడానికి గరిష్ట వయోపరిమితి 25 ఏళ్లు ఉండగా, ఇప్పుడా నిబంధనను కేంద్రం ఎత్తివేసింది. ఈ మేరకు జాతయ మెడికల్ కమిషన్ సోమవారం ప్రకటించింది. దీంతో అన్ని వయసుల వారికీ ఇకపై నీట్ పరీక్ష రాసే అవకాశం ఉండనుంది. ఈ ఏడాది నీట్ పరీక్ష జూన్లో జరిగే అవకాశం ఉంది. నోటిఫికేషన్ ఈ వారంలో రానుందని సమాచారం. కాగా, వయసు నిబంధన సడలించిన కారణంగా ఈ సారి నీట్ పరీక్షకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే, మెడికల్ సీట్లకు డిమాండ్ భారీగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.