Center good news for states..Rs.15,705.65 crore released
mictv telugu

రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్..రూ.15,705.65 కోట్లు విడుదల

August 31, 2022

కేంద్ర ప్రభుత్వం..దేశంలోని అన్నీ రాష్ట్రాలకు కాసేపటిక్రితమే ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. వినాయక చవితి సందర్భంగా ఆయా రాష్ట్రాల్లోని గ్రామీణ స్థానిక సంస్థ‌లకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు విడుద‌ల చేసింది. కేంద్రం ప్రభుత్వం విడుదల చేసిన నిధులలో రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీకి, తెలంగాణకు సంబంధించి ఎన్ని కోట్ల నిధులను మంజూరు చేసిందో? కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలియజేసింది.

”అన్ని రాష్ట్రాల్లోని స్థానిక సంస్థ‌ల‌కు మొత్తంగా రూ.15,705.65 కోట్ల‌ను విడుద‌ల చేసింది. ఈ నిధుల్లో తెలుగు రాష్ట్రాలైన ఏపీకి రూ.948.35 కోట్లు, తెలంగాణకు రూ.273 కోట్లను విడుద‌ల‌ చేసింది. ఇక, ఈ నిధుల్లో అత్య‌ధికంగా దేశంలోనే పెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు రూ.3,733 కోట్లు, బీహార్‌కు రూ.1,921 కోట్లు, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌కు వెయ్యి కోట్ల‌ు, మిగిలిన వాటికి మాత్రం వెయ్యి కోట్ల‌కు లోప‌లే నిధులను విడుదల చేసింది”.