Center has ordered Telangana to pay electricity dues to AP
mictv telugu

తెలంగాణకు కేంద్రం షాక్.. ఏపీకి డబ్బులివ్వాలని ఆదేశం

August 29, 2022

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకు షాకిచ్చింది. ఏపీకి ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలపై కీలక ఆదేశాలిచ్చింది. ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలను తెలంగాణ 30 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది.

రాష్ట్ర విభజన తర్వాత 2014 – 2017 మధ్య కాలంలో తెలంగాణ విద్యుత్ డిస్కంలకు విద్యుత్ సరఫరా చేసినందుకు ఆంధ్రప్రదేశ్‌కు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు రూ. 3,441 కోట్లు ప్రిన్సిపల్ అమౌంట్, రూ. 3,315 కోట్ల లేట్ పేమెంట్ సర్ ఛార్జీలు చెల్లించాలి. దీనికి సంబంధించి మొత్తం డబ్బును నెల రోజుల్లోగా ఏపీకి చెల్లించాలని కేంద్రం ఆదేశించింది. కాగా, ఇప్పటికే తెలంగాణకు కేంద్రం అప్పుల విషయంలో మొండి చేయి చూపింది. దీంతో ప్రభుత్వ పథకాల అమలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. ఇప్పుడు ఇంత పెద్ద మొత్తం చెల్లించాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందోననే ఆసక్తిగా మారింది.