పీఎం కిసాన్‌లో కొత్త దరఖాస్తులు.. మారిన నిబంధన - MicTv.in - Telugu News
mictv telugu

పీఎం కిసాన్‌లో కొత్త దరఖాస్తులు.. మారిన నిబంధన

June 25, 2022

రైతులకు ఆర్ధికంగా సహాయం చేసే ఉద్దేశంతో కేంద్రం తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఇప్పటివరకు 11 విడతల్లో డబ్బులు రైతులకు వచ్చాయి. ఇప్పుడీ పథకంలో కేంద్రం కొత్త రూల్ తీసుకొచ్చింది. కొత్తగా ఎవరైనా రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేయాలనుకుంటే ఇక నుంచి వారు తప్పనిసరిగా తమ రేషన్ కార్డులను కూడా సమర్పించాల్సి ఉంటుంది. పోర్టల్‌లో రేషన్ కార్డు నెంబరు ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మిగతా వివరాలు అప్‌లోడ్ అవుతాయి. రేషన్ కార్డు ప్రకారం భార్యాభర్తలలో ఎవరికో ఒకరికే ఈ పథకం కింద అర్హులవుతారు. దీంతో పాటు మిగతా పత్రాల సాఫ్ట్ కాపీలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాక, ఇకేవైసీ తప్పనిసరి. దీనికి చివరి తేదీ జులై 31గా నిర్ణయించారు. కాగా, పథకంలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా నిరోధించేందుకు కేంద్రం కొత్త నిబంధన తీసుకొచ్చిందని అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి.