తప్పు దిద్దుకున్న కేంద్రం.. అమరావతితో కొత్త మ్యాప్ - MicTv.in - Telugu News
mictv telugu

తప్పు దిద్దుకున్న కేంద్రం.. అమరావతితో కొత్త మ్యాప్

November 22, 2019

కొత్త ఇండియా పటంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మిస్సింగ్‌పై ఇటీవల వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. కేంద్రం ఇటీవలే ఈ మ్యాపును విడుదల చేసింది. అయితే ఈ మ్యాపులో అమరావతిని ఎందుకు గుర్తించలేదంటూ ఏపీకి చెందిన నేతలు కేంద్రాన్ని నిలదీశారు. ఇదంతా చంద్రబాబు సర్కార్ పుణ్యఫలమే అని బీజేపీ నేతలు ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఇండియా మ్యాప్‌లో అమరావతిని పేర్కొనాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గురువారం పార్లమెంట్‌లో డిమాండ్ చేశారు. ఇలా మ్యాపులో అమరావతిని గుర్తించకపోవడం ఆంధ్ర ప్రజలను అవమానించడమే అన్నారు. 

రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీని కూడా అవమానించినట్టేనని విమర్శించారు. గల్లా జయదేవ్ అమరావతి విషయమై మాట్లాడిన మరుసటి రోజే.. అమరావతితో కూడిన ఇండియా మ్యాప్‌ను కేంద్రం రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.