కరోనా ఫోర్త్ వేవ్‌పై కేంద్రం హెచ్చరిక - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా ఫోర్త్ వేవ్‌పై కేంద్రం హెచ్చరిక

March 18, 2022

njfvn vnh

మన దేశంలో తగ్గిపోయిందనుకున్న కరోనా.. ప్రపంచ దేశాల్లో మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. చైనాలో కొన్ని నగరాల్లో లాక్డౌన్, దక్షిణ కొరియాలో ఒకే రోజు ఆరు లక్షల కేసులు వెలుగు చూడడం, ఇజ్రయెల్లో కొత్త వేరియంట్ బయటపడడం లాంటి నేపథ్యంలో టెస్టుల సంఖ్యను పెంచాలని కేంద్రం ఆదేశించింది. గతంలోలాగా టెస్ట్, ట్రాక్, ట్రీట్, భౌతిక దూరం, టీకాలు వేయడం వంటి విధానాలు పాటించాలని స్పష్టం చేసింది. భారత్‌లో కరోనా కనిష్ట స్థాయికి పడిపోయినప్పటికీ, నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు. ఇదికాక, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల హెచ్చరికలు జారీ చేసింది. ఆంక్షలు ఎత్తివేసిన ప్రాంతాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.