కరోనా వైరస్ నుంచి రక్షణ కోసం ఇస్తున్న బూస్టర్ డోసు కాల వ్యవధిని కేంద్రం తగ్గించింది. ఇంతకుముందు రెండు డోసులు తీసుకున్న తర్వాత 9 నెలలకు మాత్రమే బూస్టర్ డోసు వేసేవారు. దానిని తాజాగా కేంద్రం 6 నెలలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఇన్ ఇమ్యూనైజేషన్ సిఫారసులను కేంద్రం ఆమోదించింది. కాల వ్యవధి తగ్గించడంతో ప్రజల నుంచి డిమాండ్ వస్తుందన్న ముందస్తు అంచనాతో డోసుల పంపిణీని పెంచాలని ఆదేశించింది. కాగా, ప్రస్తుతం ఈ డోసులను కేవలం ప్రైవేటు కేంద్రాలలోనే వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ కేంద్రాలకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంచేలా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.