Central ban on shot body spray ad
mictv telugu

రేప్‌ను ప్రోత్సహిస్తోంది… బాడీ స్ప్రే యాడ్‌పై కేంద్రం వేటు

June 4, 2022

Central ban on shot body spray ad

ఓ పక్క ఆడవారిపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతుంటే మరో పక్క వ్యాపార కంపెనీలు వాటిని ప్రోత్సహించేలా వాణిజ్య ప్రకటనలను రూపొందిస్తున్నాయి. తద్వారా యువత పక్కదారి పట్టడానికి కారణమవుతున్నాయి. ఓవైపు తెలంగాణలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటన కాక రేపుతుండగా, ఓ బాడీ స్ప్రే కంపెనీ రూపొందించిన ప్రకటన వివాదాస్పదమైంది. గుజరాత్‌కు చెందిన ఓ కంపెనీ లేయర్స్ షాట్ పేరుతో ఓ డియోడరెంటుని మార్కెట్టులో ప్రవేశపెట్టింది. తన ప్రొడక్టుని ప్రమోట్ చేసుకునే దిశగా ఆ కంపెనీ రెండు యాడ్లను రూపొందించింది.

ఇవి సామాజిక మాధ్యమాలు, టీవీలల్లో ప్రసారం కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున విమర్శలకు దిగారు. అత్యాచారాలను ప్రోత్సహించేవిధంగా ఉన్న ఈ ప్రకటనలను నిషేధించాలని డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్ర సమాచార శాఖ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలను కించపరిచే విధంగా ఉన్న ప్రకటనలను నిషేధిస్తున్నట్టు ఆదేశాలిచ్చింది. ఈ ఘటనపై విచారణ జరుపుతామని వెల్లడించింది. కంపెనీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి పోలీసులను ఆదేశించారు.