ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మరో 10 ఏళ్లు పొడిగింపు - MicTv.in - Telugu News
mictv telugu

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మరో 10 ఏళ్లు పొడిగింపు

December 4, 2019

లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను మరో 10 సంవత్సరాలు పొడిగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన భేటీలో ఈమేరకు ఆమోదం తెలిపారు.  దీనికి సంబంధించిన బిల్లును శీతాకాల సమావేశాల్లోనే సభలో ప్రవేశపెట్టనున్నారు. 2020 జనవరి 25తో గతంలో పొడిగించిన రిజర్వేషన్ల గడువు ముగుస్తుండటంతో మరో 10 ఏళ్ల పాటు పెంచారు. ఈ నిర్ణయంతో 2030 జనవరి 25 వరకు రిజర్వేషన్లు వర్తించనున్నాయి.

Central Cabinet.

వెనకబడిన కులాల అభ్యున్నతి కోసం 1902లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. అనంతరం విద్యా, ఉద్యోగ, ప్రభుత్వ రంగాలతో పాటు చట్ట సభల్లోనూ రిజర్వేషన్లు కల్పించారు. జనాభా ప్రాతిపదికన ఈ రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. చట్టసభల్లో వెనకబడిన తరగతుల కోసం రిజర్వేషన్లు తీసుకువచ్చారు. అవి మరికొన్ని రోజుల్లో ముగిసిపోనుండటంతో మరోసారి రిజర్వేషన్లను పొడగించారు.