BSNL మూసివేయం.. కేంద్ర మంత్రి క్లారిటీ - MicTv.in - Telugu News
mictv telugu

BSNL మూసివేయం.. కేంద్ర మంత్రి క్లారిటీ

October 23, 2019

చాలా రోజులుగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNLను మూసివేస్తున్నట్టు వస్తున్న వదంతులను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కొట్టిపారేశారు. బుధవారం జరిగిన కేబినెట్ భేటీ సందర్భంగా ఈ అంశంపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు వెల్లడించారు.BSNL తోపాటు దాని అనుబంధ రంగం MTNL మూసివేసే ప్రసక్తే లేదని వెల్లడించారు. 

అంతే కాకుండా వీటిని ఏ ప్రైవేటు సంస్థకూ అప్పగించబోమని తెలిపారు. BSNL, MTNL రెండింటిని విలీనానికి కేబినెట్ నిర్ణయించిందన్నారు. దీంతో పాటు ప్రైవేటు టెలికాం కంపెనీల పోటీని తట్టుకునేందుకు బీఎస్ఎన్ఎల్‌కు  4జీ స్పెక్ట్రం ఇస్తామన్నారు. బీఎస్‌ఎన్ఎల్ ఉద్యోగుల జీతాలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇక నుంచి BSNL యూజర్లకు ఇక నుంచి 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఉద్యోగులు కష్టపడి పనిచేసి ఈ సంస్థలను లాభదాయకంగా మార్చడంలో ప్రభుత్వానికి సహాయం చేయాలని ప్రసాద్ కోరారు.