ITI పూర్తి చేసిన వారికి శుభవార్త…కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగ అవకాశాలు..!!
మీరు ఐటీఐ పూర్తి చేశారా? కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం సంపాదించడమే మీ లక్ష్యమా? అయితే సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ మీకు శుభవార్త అందించింది. పలు పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేిసంది. ఈ సంస్థలో ట్రేడ్ అప్రెంటిస్ అండ్ ఫ్రెషర్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 608ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి..దరఖాస్తు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
మొత్తం 608 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో ట్రేడ్ అప్రెంటిస్ 536, ఫ్రెషర్ అప్రెంటిస్ 72 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27ఏళ్లు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వారికి 5ఏళ్లు ఓబీసీలకు మూడేళ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అభ్యర్థులు పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తిచేయాలి. ఫ్రెషర్ అప్రెంటిస్ లకు పదోతరగతి 12వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
ఇక పై పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్ అనుసరించి రూ. 6000 నుంచి 7,000, రూ. 9,000 వరకు జీతం ఉంటుంది. అభ్యర్థులను మెరిట్ ఆధారంగా సెలక్ట్ చేస్తారు. జూన్ 18 దరఖాస్తులకు స్వీకరణకు తుదిగడువుగా నిర్ణయించారు.