కేసీఆర్‌కు శుభవార్త.. 4 రాష్ట్రాలతోపాటు తెలంగాణ ఎన్నికలు! - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్‌కు శుభవార్త.. 4 రాష్ట్రాలతోపాటు తెలంగాణ ఎన్నికలు!

September 28, 2018

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినట్టే జరుగుతోంది. నాలుగు రాష్ట్రాలతోపాటే తెలంగాణ అసెంబ్లీకీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) ఓపీ రావత్ , ఇద్దరు కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఉమేష్‌ సిన్హా కమిటీ.. ఓపీ రావత్‌కు తన నివేదిక సమర్పించింది. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని, ముందస్తు ఎన్నికలకు అనుకూల వాతావరణం ఉందని నివేదికలో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాంతో పాటే ఎన్నికలు నిర్వహించవచ్చని సూచించారు. దీనిపై సీఈసీ సంతృప్తి వ్యక్తం చేశారు.

rr

ఆ నాలుగు రాష్ట్రాలతోపాటు తెలంగాణలోనూ ఎన్నికల నిర్వహిస్తే బాగుటుందని ఈసీ అధికారులు సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్రాల ఎన్నికలు నవంబర్-డిసెంబర్లలో జరగనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ రద్దు కావడంతో దానికీ ఆ రాష్ట్రాలతోపాటే పోలింగ్ పెట్టాలని టీఆర్ఎస్ కోరుతుండడం తెలిసిందే. ఓటర్ల జాబితా కూడా సిద్ధం కానుండడంతో ఇక సమస్యలు లేవని భావిస్తున్నారు. వచ్చేవారం సుప్రీం కోర్టు తీర్పు కూడా రానుండడంతో అంతవరకు వేచి చూసి అధికారిక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ముందుస్తు ఎన్నికలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై రాష్ట్రానికి, ఈసీకి కోర్టు షోకాజ్ నోటీసులివ్వడం తెలిసిందే. కాగా, వచ్చే వారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తెలంగాణలో పర్యటించనున్నారు. ఆ తర్వాత ఎన్నికల తేదీలను నిర్ణయించి షెడ్యూలు రూపొందిచే అవకాశముంది. అక్టోబర్ రెండో వారంలో 5 రాష్ట్రాల షెడ్యూల్ విడుదల కావొచ్చు. అన్ని పార్టీల అభిప్రాయాలు సేకరించామని, ఎలాంటి ఇబ్బందులు లేవని అందులో పేర్కొన్నారు.