బ్రేకింగ్.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గించిన కేంద్రం - MicTv.in - Telugu News
mictv telugu

బ్రేకింగ్.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గించిన కేంద్రం

May 21, 2022

మండుతున్న ధరల నుంచి ప్రజలకు కాస్తంత ఊరట. పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త భారీగానే తగ్గనున్నాయి. వీటిపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. లీటరు పెట్రోల్‌పై రూ. 8, డీజిల్‌పై లీటరుకు రూ. 6 తగ్గిస్తున్నామని వెల్లడించారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పై రూ. 200 రాయితీ ఇస్తామని వెల్లడించారు.

ఈమేరకు ఆయా రాష్ట్రాల్లోనూ ధరలు తగ్గనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 119.45, డీజిల్ రూ. 105.49 పలుకుతోంది. కేంద్రం తగ్గింపుకు  తగ్గట్లు రాష్ట్రాలు కూడా తగ్గిస్తే పెట్రోల్ రూ. 110, డీజిల్ రూ. 99 కు అందుబాటులో రానున్నాయి. కేంద్రం నిర్ణయంతో రాష్ర్టాలు కూడా ధరలు తగ్గిస్తే మరింత ఊరట దక్కుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలకు నిత్యావసరాల ధరలకు సంబంధం ఉండడంతో అన్ని సరుకుల ధరలు మండుతున్నాయి. ప్రజల ఆగ్రహాన్ని తగ్గించడానికే మోదీ సర్కారు ధరలును కిందికి దించింది.