సీబీఐ డైరెక్టర్‌గా మన తెలంగాణ ఐపీఎస్ - MicTv.in - Telugu News
mictv telugu

సీబీఐ డైరెక్టర్‌గా మన తెలంగాణ ఐపీఎస్

October 24, 2018

సీబీఐ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా తెలంగాణం బిడ్డ మన్నెం నాగేశ్వరరావు బాధ్యతలు తీసుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి అధికారులతో అత్యవసర సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీబీఐ డైరెక్టర్‌ను మార్చేశారు. ఇప్పటి వరకు సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వరంగల్ జిల్లా మంగపేట మండలం బోర్‌నర్సాపూర్ గ్రామానికి చెందిన నాగేశ్వరరావును తాత్కలిక డైరెక్టర్‌గా నియమించారు. 1986 ఐపీఎస్‌గా ఎన్నికైన నాగేశ్వరరావు.. ఒడిషా క్యాడర్‌కు చెందిన వ్యక్తి.. ఒడిషా డీజీపీగా కూడా పనిచేశారు.Central Government Appoints Telangana IAS Nageswara Rao As Interim CBI Directorఇప్పటి వరకు సీబీఐ డైరెక్టర్‌గా కొనసాగిన అలోక్ వర్మకు స్పెషల్ డైరెక్టర్ ఆస్తానాకు మధ్య అవినీతి పోరు నడుస్తుండటంతో ప్రధాని కార్యాలయంలో దీనిపై దృష్టి సారించింది. దీంతో అలోక్ వర్మను డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పించారు. తెలంగాణకు చెందిన మన్నెం నాగేశ్వరరావు వెంటనే సీబీఐ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టాలని కేంద్ర ఆదేశాలు కూడా జారీ చేసింది.  గతంలో సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసిన విజయరామారావు తర్వాత తెలుగు అధికారికి మరోసారి సీబీఐ డైరెక్టర్‌గా అవకాశం వచ్చింది.