Central government award for Telangana state for safe drinking water
mictv telugu

‘మంచినీటి’ తెలంగాణకు మరో అవార్డు

September 28, 2022

మంచినీటి సరఫారలో తెలంగాణ రాష్ట్రం మరో ప్రతిష్టాత్మక అవార్డు సొంతం చేసుకుంది. దేశంలో అత్యధికంగా మారుమూల గ్రామీణ ప్రాంతాలకు ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధి చేసిన మంచి నీటిని అందిస్తున్న ఎకైక రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం అవార్డుకు ఎంపికైంది. అక్టోబర్ 2న ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును అందజేస్తారు. నేషనల్ జల్ జీవన్ మిషన్ అడిషనల్ సెక్రెటరీ, మిషన్ డైరెక్టర్ వికాస్ శీల్ ఈ వివరాలతో రాష్ట్రానికి లేఖ రాశారు. స్వచ్ఛ సర్వేక్షణలో రాష్ట్రానికి వివిధ కేటగిరీలలో మరో 13 అవార్డులు తెలంగాణను వరించాయి.

ఈ ఘనత సాధించినందుకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సంబంధిత శాఖల సిబ్బందిని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభినందించారు. తెలంగాణకు మంచినీటి సరఫరాలో ఇప్పటికే పలు అవార్డులు రివార్డులు అందాయి. దేశంలో 100% ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీటిని అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపుపొందింది. 100% ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా అవతరించింది.