రాజధాని ఏర్పాటుపై కేంద్రం క్లారిటీ.. ఏం చెప్పిందంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

రాజధాని ఏర్పాటుపై కేంద్రం క్లారిటీ.. ఏం చెప్పిందంటే..

February 4, 2020

vbhhbh

ఏపీ రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో స్పష్టతనిచ్చింది. రాజధానిపై నిర్ణయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనిదేనని పేర్కొంది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. మూడు రాజధానుల అంశంపై కూడా మీడియా ద్వారా తెలుసుకున్నామని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు. 

గతంలో అమరావతిని రాజధానిగా గుర్తించిన అంశాన్ని కూడా దీంట్లో ప్రస్తావించారు. 2015లో అప్పటి ప్రభుత్వం అమరావతిని ఏర్పాటు చేస్తే దాన్ని కేంద్రం నోటిఫై చేసిందని పేర్కొన్నారు. కాగా మూడు రాజధానుల అంశాన్ని కేంద్రం ద్వారా అడ్డుకోవాలని విపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ విషయంలో మోదీ సర్కార్ స్టాండ్ ఎలా ఉంటుందని అంతా ఆసక్తిగా చర్చించుకున్నారు. తాజాగా రాష్ట్రాల పరిధిలోనిదే రాజధాని అంశమని స్పష్టం చేయడంతో మూడు రాజధానుల ఏర్పాటుకు పెద్దగా ఆటంకాలు ఉండే అవకాశం లేదని పలువురు విశ్లేషిస్తున్నారు.